Wednesday, August 14, 2013

రానేల వసంతాలే



రానేల వసంతాలే
శృతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం
స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం
స్మరించే గీతం

రానేల వసంతాలే

ఈ మౌన పంజరాన నే మూగనై
నీ వేణువూదగానే నే రాగమై
ఇగిరే శోకమై
విరిసే తోటనై
ఏ పాట పాడిన అది పూవులై
అవి నేల రాలిన చిరు తావినై
బదులైన లేని ఆశలారబోసి

రానేల వసంతాలే

ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా
ఈ చెలిమినీ ఇపుడే దరి చేర్చవా
రగిలే తాపమే ఎదలో తీరగా
నీ చూపు తోనే చలి తీరగా
నీ స్పర్శ తోనే మది పాడగా
ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా

రానేల వసంతాలే
శృతి కానేల సరాగాలే
నీవే నా జీవన రాగం
స్వరాల బంధం
నీవే నా యవ్వన కావ్యం
స్మరించే గీతం

రానేల వసంతాలే
శృతి కానేల సరాగాలే

చిత్రం : డాన్స్ మాస్టర్
గానం : చిత్ర
సాహిత్యం : వేటూరి
సంగీతం : ఇళయరాజా

No comments:

Post a Comment