Wednesday, July 13, 2016

పట్టుదలతో చేస్తే సమరం

చిత్రం: సంబరం
సంగీతం: ఆర్. పి. పట్నాయక్
రచన: సిరివెన్నెల సీతారామశాస్త్రి
గానం: మల్లికార్జున్

పట్టుదలతొ చెస్తె సమరం
తప్పకుండ నీదె విజయం
కష్తపదితె రాదా ఫలితం
పదరా సొదరా
నీ ధైర్యం తొడై వుండగ
ఏ సాయం కొసం చూడక
నీ ధ్యెయం చూపె మర్గం లొ
పొరా సూటిగా

ఏ నాడు వెనకడుగెయక
ఏ అడుగు తడబడనీయక
నీ గమ్యం చూపె మర్గం లొ
పొరా సూటిగా


ఈష్టం అంటే చెదు కూడ తీయనే
కస్టం అంటే దూది కూడ భారమే
లక్ష్యమంటు లేని జన్మె దండగా
లక్షలాది మంది లేరా మందగా
పంతం పట్టి పొరాడందె
కొరినవరాలు పొందలెరు కదా


చెస్తూ వుంటె ఏ పనైనా సాధ్యమే
చూస్తూ వుంటే రొజులన్నీ శూన్యమే  
ఒక్క అడుగు వేసి చూస్తే చాలురా
ఎక్కలేని కొండనెదే లేదురా
నవ్వేవాళ్ళు నివ్వెరపోగ
దిక్కులు జయించి సాగిపోరమరి  



Friday, April 22, 2016

నమస్తే మిత్రులారా,
ఒక్కోసారి జీవితం లో ఒడిదుడుకులు ఆటుపోట్లు మనల్ని నిర్వీర్యం చేస్తాయి జీవితం మీద ఆస కోల్పోయి విరక్తి పెరుగుతుంది. అటువంటప్పుడే ఒక మంచి మాట ఒక ప్రేరణ కలిగించే పాటే మనల్ని తిరిగి ఆశా జీవులుగా కొత్త ఆస తో బ్రతికెల చేస్తాయి అలాంటి కొన్ని ప్రేరణ కలిగించే పాటలు ఇవి

1. మౌనంగానే ఎదగమని
చిత్రం: నా ఆటోగ్రాఫ్
రచన: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
గానం: చిత్ర

ప: మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
    ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది

    అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
    ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది (2)

చ:  దూరమెంతో వుందని దిగులుపడకు నేస్తమా
      దరికిచేర్చు దారులు కూడా వున్నాయిగా
      భారమెంతో వుందని బాధపడకు నేస్తమా
      బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా

      సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
      విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొస్తుంది

      అవరోధాల దీవుల్లో ఆనంద నిధి వున్నది
      కష్టాల వారధి దాటినా వారికే సొంతమవుతుంది

      తెలుసుకుంటే సత్యమిది
      తలుచుకుంటే సాధ్యమిది

చ:  చెమట నీరు చిందగా, నుదుటి రాత మార్చుకో
      మారలేనిదేది లేదని గుర్తుంచుకో
      పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
      మారిపోని కథలే లేవని గమనించుకో

       తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
      నచినట్లుగా నీ తలరాతని నువ్వే రాయాలి
      నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
      నీ అడుగుల్లో జత కలిపి స్వర్గాలే పయనించగా
      నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి

       అంతులేని చరితలకి, ఆది నువ్వు కావాలి