నమస్తే మిత్రులారా,
ఒక్కోసారి జీవితం లో ఒడిదుడుకులు ఆటుపోట్లు మనల్ని నిర్వీర్యం చేస్తాయి జీవితం మీద ఆస కోల్పోయి విరక్తి పెరుగుతుంది. అటువంటప్పుడే ఒక మంచి మాట ఒక ప్రేరణ కలిగించే పాటే మనల్ని తిరిగి ఆశా జీవులుగా కొత్త ఆస తో బ్రతికెల చేస్తాయి అలాంటి కొన్ని ప్రేరణ కలిగించే పాటలు ఇవి
1. మౌనంగానే ఎదగమని
చిత్రం: నా ఆటోగ్రాఫ్
రచన: చంద్రబోస్
సంగీతం: కీరవాణి
గానం: చిత్ర
ప: మౌనంగానే ఎదగమని మొక్క నీకు చెపుతుంది
ఎదిగినకొద్దీ ఒదగమని అర్ధమందులో వుంది
అపజయాలు కలిగిన చోటే గెలుపు పిలుపు వినిపిస్తుంది
ఆకులన్నీ రాలిన చోటే కొత్త చిగురు వికసిస్తుంది (2)
చ: దూరమెంతో వుందని దిగులుపడకు నేస్తమా
దరికిచేర్చు దారులు కూడా వున్నాయిగా
భారమెంతో వుందని బాధపడకు నేస్తమా
బాధ వెంట నవ్వుల పంట ఉంటుందిగా
సాగరమధనం మొదలవగానే విషమే వచ్చింది
విసుగే చెందక కృషి చేస్తేనే అమృతమొస్తుంది
అవరోధాల దీవుల్లో ఆనంద నిధి వున్నది
కష్టాల వారధి దాటినా వారికే సొంతమవుతుంది
తెలుసుకుంటే సత్యమిది
తలుచుకుంటే సాధ్యమిది
చ: చెమట నీరు చిందగా, నుదుటి రాత మార్చుకో
మారలేనిదేది లేదని గుర్తుంచుకో
పిడికిలే బిగించగా చేతి గీత మార్చుకో
మారిపోని కథలే లేవని గమనించుకో
తోచినట్లుగా అందరి రాతను బ్రహ్మే రాస్తాడు
నచినట్లుగా నీ తలరాతని నువ్వే రాయాలి
నీ ధైర్యాన్ని దర్శించి దైవాలే తలదించగా
నీ అడుగుల్లో జత కలిపి స్వర్గాలే పయనించగా
నీ సంకల్పానికి ఆ విధి సైతం చేతులెత్తాలి
అంతులేని చరితలకి, ఆది నువ్వు కావాలి