ఓ పాపా లాలి జన్మకే లాలి ప్రేమకే లాలీ పాడనా తీయగా- ఓ పాపా లాలి జన్మకే లాలిప్రేమకే లాలీ పాడనా.. ఓ పాపా లాలీ!..
నా జోలలా లీలగా తాకాలని గాలినే కోరనా జాలిగా.. నీ సవ్వడే సన్నగా ఉండాలని కోరనా గుండెనే కోరికా.. కలలారని పసిపాప తలవాల్చిన ఒడిలో తడి నీడలు పడనీకే ఈ దేవత గుడిలో చిరు చేపల కనుపాపలకిది నా మనవి.. ఓ పాపాలాలీ
ఓ మేఘమా! ఉరమకే ఈ పూటకి గాలిలో..తెలిపో..వెళ్ళిపో.. ఓ కోయిలా పాడవే నా పాటనీ తీయనీ ..తేనెలే..చల్లిపో! ఇరుసంధ్యలు కదలాడే ఎద ఊయల ఒడిలో సెలయేరులా అల పాటే వినిపించని గదిలో చలి ఎండకు సిరివెన్నలకిది నా మనవి.. ఓ పాపాలాలీ
చిత్రం : గీతాంజలి గానం : ఎస్.పి.బాలసుబ్రహ్మణ్యం సంగీతం: ఇళయరాజా
Wednesday, August 14, 2013
రానేల వసంతాలే
రానేల వసంతాలే శృతి కానేల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేల వసంతాలే
ఈ మౌన పంజరాన నే మూగనై నీ వేణువూదగానే నే రాగమై ఇగిరే శోకమై విరిసే తోటనై ఏ పాట పాడిన అది పూవులై అవి నేల రాలిన చిరు తావినై బదులైన లేని ఆశలారబోసి
రానేల వసంతాలే
ఓ ప్రేమికా చెలియా ఒడి చేరవా ఈ చెలిమినీ ఇపుడే దరి చేర్చవా రగిలే తాపమే ఎదలో తీరగా నీ చూపు తోనే చలి తీరగా నీ స్పర్శ తోనే మది పాడగా ఎదమీటి పోయే ప్రేమగీతిలాగా
రానేల వసంతాలే శృతి కానేల సరాగాలే నీవే నా జీవన రాగం స్వరాల బంధం నీవే నా యవ్వన కావ్యం స్మరించే గీతం
రానేల వసంతాలే శృతి కానేల సరాగాలే
చిత్రం : డాన్స్ మాస్టర్గానం : చిత్ర సాహిత్యం : వేటూరి సంగీతం : ఇళయరాజా
రామ రామ రామ రామ రామ రామ రామ మరామ రామ రామ మరామ రామ మరామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామరామరామఅనేరాజమందిరం ఘల్లుఘల్లుమనితిరిగేరామసుందరం
రాజమందిరం బాల సుందరం
ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
బాణముతో గోడ మీద కోతి బొమ్మ గీస్తడంట వజ్రపుటుంగరము తీసి కాకి పైకి విసురునంట సిలకెంగిలి జాంపండే కోరి మరీ తింటడంట ఖర్జురాలు, ద్రాక్షలూ ఉడతలకే పెడతడంట
దాక్కుంటడంటా, సెట్టు సాటుకెళ్ళీ రాళ్ళేస్తడంటా చెరువులోన మళ్ళీ అమ్మా నాన్నా అంతా ఆ అల్లరి మెచ్చుకుని బాలారాముని భలే అని ముద్దులు పెట్టారంటా..
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
అమ్మ నాన్న అన్ని మాకు నువ్వె కాద అమ్మ ఎప్పుడు ఇంకా హద్దులు మీరం తప్పుని మన్నించమ్మా
రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
రాజమందిరం బాల సుందరం ముద్దు ముద్దు మాటలంట ముద్దుగారి పోతాడంట ఆపరాని అల్లరంట తేపతేప తీయనంట బాలరాముడల్లరంటే వశిష్టునికి ఇష్టమంట రామ రామ రామ రామ రామ రామ రామ అనే రాజమందిరం ఘల్లు ఘల్లు మని తిరిగే రామ సుందరం
చిత్రం: శ్రీరామ రాజ్యం రచన : జొన్నవిత్తుల గానం: అనిత, శ్వేత సంగీతం : ఇళయరాజా